కేసీఆర్‌ కుటుంబం అవినీతితో నిండిపోయింది

– కాంగ్రెస్‌ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌ రావు ఠాక్రే
నవతెలంగాణ చేవెళ్ల
సీఎం కేసీఆర్‌ కుటుంబం అవినీతితో నిండిపో యిందని, ఆయన కూతురు కవిత లిక్కర్‌ స్కాంలో ఉందని కాంగ్రెస్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ చార్జి మాణిక్‌ రావ్‌ ఠాక్రే విమర్శించారు. గురువారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలో ఆయన పర్యటించారు. ఈ నెల 26న చేవెళ్లలోని కేవీఆర్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేస్తున్న ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ సభ జరిగే స్థలాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం ఆ యన విలేకరులతో మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ ద్వారా రూ.30 వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంద న్నారు. అదేవిధంగా ఓబీసీ, మైనార్టీ, మహిళ డిక్లరేష న్‌ చేయాల్సి ఉందని అన్నారు. కాంగ్రెస్‌ చేసేదే చెప్పు తుందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ అని, ప్రజల మనోభా వాలను గుర్తించి రాష్ట్రం ఇచ్చారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజల సొమ్ము దుర్వినియోగం చేస్తూ.. భూములు అమ్ముతూ.. సీఎం కేసీఆర్‌ ప్రభు త్వాన్ని నడుపుతున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్‌పై విశ్వాసం ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ విజయ ఢంకా మోగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వరంగల్‌లో రాహుల్‌ గాంధీ రైతు డిక్లరేషన్‌, హైదరాబాద్‌లో ప్రియాంక గాంధీ యూత్‌ డిక్లరేషన్‌ చేశారన్నారు. ఈ నెల 26న ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికా ర్జున ఖర్గే చేయనున్నారని తెలిపారు. ఈ కార్యక్ర మంలో ఏఐసీసీ కార్యదర్శి, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్‌ ఇన్‌చార్జి మన్సూర్‌ అలీఖాన్‌, సెక్రెటరీ రోహిత్‌ చౌదరి, విష్ణు ఆనంద్‌, మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌ కుమార్‌, మాజీ ఎమ్మెల్సీ యాదవరెడ్డి, పార్లమెంట్‌ ఇన్‌చార్జి నరేందర్‌ రెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్‌ చాంబర్‌ అధ్యక్షులు చింపుల సత్యనారాయణరెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షులు పడాల వెంకటస్వామి, టీపీసీసీ సభ్యులు జనార్ధన్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, ఉదరు మోహన్‌ రెడ్డి, సీనియర్‌ నాయకులు సున్నపు వసంతం, షాబాద్‌ దర్శన్‌, చేవెళ్ల సర్పంచ్‌ శైలజా అగిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.