కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం

నవతెలంగాణ- ఆర్మూర్
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఒప్పంద ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేస్తామని హామీ నీ నిలబెట్టుకొని.చెప్పిన మాట ప్రకారం ఫైల్ పైన సంతకం దీనితో రాష్ట్రవ్యాప్తంగా కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులర్ అయిన సందర్భంగా శనివారం పట్టణంలోని సాంఘిక సంక్షేమ  ఉపాధ్యాయులు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ యొక్క సేవలను గుర్తించి తమను రెగ్యులర్ చేసినందుకు ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు  కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో  సాంఘిక సంక్షేమ బాలుర పాఠశాల ఉపాధ్యాయులు చిన్నయ్య, రవి, షీలా రాణి ,శిరీష,  బాలికల పాఠశాల నుండి స్వర్ణలత, ధనలక్ష్మి, సుహాసిని ,అనిత ,ప్రసన్న తదితరులు పాల్గొనడం జరిగింది.