16న సంగారెడ్డిలో కేసీఆర్‌ బహిరంగ సభ

– దూకుడు పెంచిన బీఆర్‌ఎస్‌
– ఎన్నికల సన్నాహకాల్లో అంతా తానై నడుపుతున్న హరీశ్‌రావు
– ఉమ్మడి మెదక్‌ జిల్లా అంతటా సిద్దిపేట మార్క్‌ వ్యుహాలు
– మెదక్‌, జహీరాబాద్‌ లోక్‌సభ సిట్టింగ్‌ స్థానాలపై ప్రత్యేక దృష్టి
– కరువు, రైతాంగ సమస్యలపై పోకస్‌
– కాంగ్రెస్‌ హామీల వైఫల్యాలపై విమర్శనాస్త్రాలు
నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి
పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ దూకుడు పెంచింది. మెదక్‌, జహీరాబాద్‌ రెండు సిట్టింగ్‌ ఎంపీ స్థానాలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. మాజీ మంత్రి హరీశ్‌రావు అంతా తానై ఎన్నికల సన్నాహకాల్ని నడుపుతున్నారు. సిద్దిపేట మార్క్‌ వ్యుహాల్ని ఉమ్మడి మెదక్‌ జిల్లా వ్యాప్తంగా అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ సీఎం కేసీఆర్‌ సంగారెడ్డి జిల్లా కేంద్రంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. కరువు, రైతాంగ సమస్యలపై పోకస్‌ పెట్టి రాష్ట్ర ప్రభుత్వ వైపల్యా లను ప్రజల్లో ఎండగట్టే ప్రయత్నం కనిపిస్తుంది. కాంగ్రెస్‌ అమలు చేయలేని ఎన్నికల హామీల్ని ప్రస్తావిస్తూ ప్రజల్లో సానుభూతిని పొందేలా బీఆర్‌ఎస్‌ ముందుకు సాగుతోంది.
సొంత ఇలాకలో పట్టు నిలుపుకునే వ్యుహాలు…
మెదక్‌, జహీరాబాద్‌ రెండు పార్లమెంట్‌ నియోజక వర్గాల్లో 14 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. వీటిల్లో ఏనిమిది చోట్ల బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలున్నారు. మాజీ సీఎం కేసీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావు, మాజీ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ముగ్గురు కూడా మెదక్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోనే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మెదక్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ నియోకజవర్గాలకు గాను మెదక్‌ తప్ప ఆరు చోట్ల బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలే ఉన్నారు. దీంతో మెదక్‌ పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని బీఆర్‌ఎస్‌ తమ కంచుకోటగా బావిస్తుంది. కేసీఆర్‌, హరీశ్‌రావు సొంత ఇలాక అయిన మెదక్‌ లోక్‌సభ స్థానంలో ఏలాగైనా గెల్చి తీరాలన్న పట్టుదలతో గులాబీ దళం ఎన్నికల కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అత్యధిక మంది ఎమ్మెల్యేలుండడమే కాకుండా ఓట్ల పరంగా చూసినా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులకు పోలైన ఓట్ల కంటే బీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు వచ్చిన ఓట్లు అధికంగా ఉన్నాయి. 2 లక్షల ఓట్ల వరకు బీఆ ర్‌ఎస్‌కు మెజార్టీ వచ్చింది. అందులో దుబ్బాకలో 55 వేలు, సిద్దిపేటలో 65 వేలు, గజ్వేల్‌లో 45 వేల ఓట్ల మెజార్టీ వచ్చినందున పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ అదే పద్దతిలో ఓట్లు పొందాలని మాజీ సీఎం కేసీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావు పావులు కదుపుతున్నారు. ఆర్థిక వనరులున్న మాజీ కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డిని బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దించింది. ఎంపీ అభ్యర్థికి వందల కోట్లు ఖర్చు చేయగలిగే ఆర్థిక పరిపుష్టి ఉన్నందున బీఆర్‌ఎస్‌ క్యాడర్‌ చేజారి పోకుండా ఉంటున్నారనే చర్చ ఉంది. జహీరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో సైతం రెండు సార్లు గెలిచనందున మూడో సారి కూడా గెలిచి తీరాలన్నట్లుగా పనిచేస్తున్నారు. నిజామాబాద్‌, కామారెడ్డి, జక్కల్‌, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జహీరాబాద్‌, అందోల్‌, నారాయణఖేడ్‌ నియోజకవర్గాల్లో మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఎన్నికల బాధ్యతలు చూస్తున్నారు. ఎంపీ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్‌ సైతం ఆర్థికంగా వనరులున్న వ్యక్తే కావడంతో ప్రత్యర్థులకు ధీటుగా ఖర్చు చేసే అవకాశముందంటున్నారు. ఈ నియోజకవ ర్గంలో రెండు చోట్ల బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలున్నారు.
సిద్దిపేట మార్క్‌ వ్యుహాలు సిద్దం..
మెదక్‌, జహీరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గాల పరి ధిలో ఉన్న పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో సిద్దిపేట మార్క్‌ ఎన్నికల వ్యుహాల్ని అమలు చేయనున్నట్లు తెలు స్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దిపేట, గజ్వేల్‌, దుబ్బాక, మెదక్‌, నర్సాపూర్‌, సంగారెడ్డి, జహీరాబాద్‌, పటాన్‌చెరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సిద్దిపేటకు చెందిన హరీశ్‌రావు అనుచర గణమే ఎన్నికల వ్యుహాల్ని అమలు చేసింది. ఆయా నియోకవర్గాలకు ఎంపిక చేసిన వ్యక్తులు నియోజకవర్గ కేం దంలో మకాం వేసి తెరచాటు వ్యుహాలన్నీ నడిపారు. పార్టీ క్యాడర్‌, లీడర్ల పనిని పరిశీలిస్తూ లోపోల్స్‌ ఉంటే సరి చేయ‌డం, ప్రత్యర్థి పార్టీలోని అసంతృప్తిల్ని రహాస్యంగా కలిసి తమకు అనుకూలంగా మార్చుకోవడం, సామాజిక వర్గాల వారిగా ఓటర్లకు డబ్బులు పంపిణీ చేయడం, అనుకూల, ప్రతికూల ఆంశాలను పసిగట్టి నష్టనివారణ చర్య లకు పూనుకోవడం వంటి వ్యుహాల్ని నడిపారు. రాష్ట్ర మం తటా బీఆర్‌ఎస్‌కు ఎదురుగాలి వీచింది. కానీ..! ఉమ్మడి మెదక్‌ జిల్లాలో మాత్రం అనుకూల ఫలితాలు రాబట్టింది. హరీ శ్‌రావు వ్యుహా ప్రతి వ్యుహాలు ఫలించడం వల్లనే గెల్వ లేని పరిస్థితులున్న సంగారెడ్డి, పటాన్‌చెరు, నర్సాపూర్‌, జహీరా బాద్‌ స్థానాల్లో సైతం బీఆర్‌ఎస్‌ గెల్చింది. అందుకే పార్లమెం ట్‌ ఎన్నికల్లోనూ అంతా తానై హరీశ్‌రావు బాధ్య తలు మోస్తు న్నారు. లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి సమావేశా లన్నింటికీ హరీశ్‌రావు హాజరయ్యారు. మండల స్థాయి, యు వజన, ఇతర విభాగాల సమావేశాల్లోనూ ఆయనే పాల్గొం టూ పార్టీ శ్రేణుల్లో జోష్‌ నింపుతున్నారు.
16న సంగారెడ్డిలో కేసీఆర్‌ సభ
పార్లమెంట్‌ ఎన్నికల్లో భాగంగా ఈనెల 16న సంగా రడ్డిలో బీఆర్‌ఎస్‌ ఎన్నికల సభ నిర్వహించనుంది. ఈ సభ కు ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ హాజరుకాను న్నా రు. కేసీఆర్‌ సభ ఏర్పాట్ల కోసం సుల్తాన్‌పూర్‌, సింగూర్‌ చౌ రస్తాలో స్థలం ఎంపిక చేశారు. స్థానిక ఎమ్మెల్యే చింత ప్రభా కర్‌, అందోల్‌ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌ కేసీఆ ర్‌ స భ ఏర్పాట్లను పర్యవేక్షించారు. పార్లమెంట్‌ నియో జకవ ర్గ స్థాయి ఎన్నికల సన్నాహాక సమావేశం తర్వాత అన్ని అసెం బ్లీ నియోజకవర్గాల్లోనూ సమావేశాలు జరిపారు. ఆ తర్వాత అన్ని మండల స్థాయి సమావేశాలు జరుపుతున్నారు. అవి పూర్తయిన చోట యువత, మహిళా, రైతు, మైనార్టీ వంటి వి భాగాల సమావేశాలు కూడా నడుపుతుంది. ఇత ర పార్టీల కంటే సమావేశాల నిర్వహణలో బీఆర్‌ఎస్‌ ముం దుంది.అదే జోష్‌ను కొనసాగిస్తూ బహిరంగ సభకు సిద్దమైంది.