కెసిఆర్ బహిరంగ సభ విజయవంతం చేయాలి

నవతెలంగాణ- హుస్నాబాద్ రూరల్:
హుస్నాబాద్ లో ఈనెల 15న జరిగే కెసిఆర్ బహిరంగ సభను విజయవంతం చేయాలని గురువారం హుస్నాబాద్ పట్టణంలోని రెండో వార్డు కౌన్సిలర్ మోజు రమాదేవి రవీందర్, బీఆర్ఎస్ నాయకులతో కలిసి మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న సమావేశం ఏర్పాటు చేశారు. బహిరంగ సభకు భారీ ఎత్తున జనం తరలివచ్చేందుకు నాయకులు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ఐలేని అనిత శ్రీనివాస్ బ, బొజు రమాదేవి రవీందర్ , పెరుక భాగ్య రెడ్డి, గోవింద రవి, గూల్ల రాజు, బొల్లి కల్పన, జనగామ రత్నమాల, మిరియాల రమేష్, బొజ్జ హరీష్ ,  వాల సుప్రజా తదితరులు పాల్గొన్నారు.