
కరీంనగర్ లో జరిగే కేసీఆర్ భారీ బహిరంగసభ విజయవంతం చేయాలని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ అన్నారు. బుధవారం హుస్నాబాద్ పట్టణంలోని బీ అర్ ఎస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గస్థాయి కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 12 వ తేదీన కరీంనగర్ జిల్లా కేంద్రం ఎస్ ఆర్ ఆర్ గార్డెన్ లో జరిగే పార్లమెంట్ ఎన్నికల శంఖారావ సభ కు హుస్నాబాద్ నియోజకవర్గం నుండి అన్ని మండలాల నుండి అధిక సంఖ్యలో తరలించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.