రాష్ట్రంలో కెసిఆర్ పాలనకు చరమగీతం పాడాలి

నవతెలంగాణ- తిరుమలగిరి
రాష్ట్రంలో కెసిఆర్ నియంత పాలన జరుగుతుందని వాటికి చరమ గీతం పడాల్సిన సమయం ఆసన్నమైందని తుంగతుర్తి నియోజకవర్గ బిజెపి అభ్యర్థి కడియం రామచంద్రయ్య అన్నారు. గురువారం తిరుమలగిరి మండలం జలాలపురం, మామిడాల తదితర గ్రామాల్లో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గత తొమ్మిదేళ్లుగా రేషన్ కార్డులు ఎవరికి ఇవ్వలేదని, డబల్ బెడ్ రూమ్ ల ఊసే లేదని, వాటి గురించి పట్టించుకునే వారే లేరని, దళిత బంధు అక్రమాలకు నిలయమైందని ఆరోపించారు. గత తొమ్మిది సంవత్సరాలుగా తుంగతుర్తి అబివృద్ధి కి నోచుకోలేదని ఆరోపించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి పార్టీని గెలిపిస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తా అన్నారు. నవంబర్ 30 న బిజెపి పార్టీ గుర్తు కమలం పువ్వుకు ఓటేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మల్లెపాక సాయిబాబా, ఝాన్సీ రాణి, మేడబోయిన యాదగిరి, దీన్ దయాల్, వేల్పుల బంగారు స్వామి, హనుమంతు, సుభాష్ రెడ్డి, బొల్లు మల్లయ్య, రాకేష్, దేవేందర్ నాయక్, సైదులు, చిలుకా అశోక్ తదితరులు పాల్గొన్నారు.