– ఎవరు పార్టీ మారిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపును ఆపలేరు
– ఎంపీపీ ఏడు దొడ్ల శ్వేతరవీందర్ రెడ్డి
నవ తెలంగాణ- నాంపల్లి: భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ పార్టీని రానున్న సాధారణ ఎన్నికలలో మూడవసారి అధికారంలోకి తీసుకు వస్తాయని నాంపల్లి ఎంపీపీ ఏడుదొడ్ల శ్వేత రవీందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం నాంపల్లి మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ కొందరు వ్యక్తులు పార్టీ మారినంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీకి ఎటువంటి నష్టం ఉండదని మా నాయకుడు సీఎం కేసీఆర్ ఆశీర్వదించి పంపిన మునుగోడు బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపును ఎవరు అడ్డుకోలేరని అన్నారు. పార్టీ మారే వ్యక్తులు వారి సొంత లాభాల కోసం పార్టీ మారుతున్నారు తప్ప ప్రజల సంక్షేమం కొరకు కాదని అన్నారు. కడుపులో పుట్టిన కన్నా కొడుకులు వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను పట్టించుకోలేని పరిస్థితుల్లో వారందరికీ అండగా ఉండేందుకు ఆసరా పెన్షన్ ద్వారా రూ.2016 లు ఇస్తూ వారికి అండగా ఉంటున్న సీఎం కేసిఆర్ కు ప్రతి ఒక్కరు అండగా, బాసటగా ఉన్నారని, రైతుబంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, మిషన్ భగీరథ చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమ పథకాలు రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలు అందని ఇల్లు అంటూ లేదని వారంతా బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉన్నారని అన్నారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలైతున్నాయి అంటే అది కేవలం సీఎం కేసీఆర్ సామర్థ్యం వల్లనే అని తెలిపారు. సమర్ధుడైన పాలకుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటేనే ప్రజలకు అందవలసిన సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతాయని అన్నారు. 60 ఏండ్లు తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన సీఎం కేసీఆర్ కు అండగా ఉండి ఆయన్ని మూడోసారి సీఎం గా చూసుకోవాల్సిన బాధ్యత కార్యకర్తపై , ప్రజలందరిపై ఉందన్నారు. మునుగోడు నియోజకవర్గం మరింత అభివృద్ధి పథంలో ముందుకు పోవాలంటే మునుగోడు ప్రజలు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించవలసిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి మండల రైతుబంధు కన్వీనర్ ఏడుదొడ్ల రవీందర్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కుంభం కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు గుమ్మడపు నరసింహారావు, సర్పంచులు నాగులవంచ శ్రీలత నరేందర్ రావు, బల్గూరి విష్ణువర్ధన్ సాగర్, కోరె యాదయ్య, కారింగు నరసింహ, సపావట్ సర్దార్, బుషిపాక నగేష్, జెల్లల్ల సైదులు, భాష నాయక్, ఎండి సలీం, నాంపల్లి హనుమంతు, కోరే కిషన్, కోరే జయరాం, కర్నె యాదయ్య, ఎదుళ్ళ యాదగిరి, గుండెబోయిన సత్తయ్య, పంగ కొండయ్య తదితరులు పాల్గొన్నారు.