హైదరాబాద్: ప్రముఖ లూబ్రికెంట్ తయారీదారు అయిన క్యాస్ట్రోల్ ఇండియా నూతన మేనేజింగ్ డైరెక్టర్‌గా కేదార్ లేలే నియమితులయ్యారు. నవంబర్ 1 నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారని ఆ కంపెనీ తెలిపింది. హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ (హెచ్‌యూఎల్)లో రెండు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్ తర్వాత కేదార్ కాస్ట్రోల్‌లో చేరారు. హెచ్‌యూఎల్‌లో ఆయన చివరిగా కంపెనీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేశారు. దక్షిణాసియాలోని సేల్స్ అండ్ కస్టమర్ డెవ లప్‌మెంట్‌కు బాధ్యత వహించారు. సంస్థను వృద్థిలో నడిపించడంలో అతని అపార అనుభవం తమ సంస్థకు కలిసి రానుందని కాస్ట్రోల్ ఇండియా లిమిటెడ్ చైర్మెన్ రాకేష్ మఖిజా పేర్కొన్నారు.