విభేదాలు పక్కనబెట్టి సమన్వయంతో పని చేయాలి

– అభివృద్దే నా ఎజెండా సంక్షేమమే నా అభిమతం
– హుస్నాబాద్ లో కరవు రక్కసిని జయించాం
– హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
విభేదాలు పక్కన పెట్టి బిఆర్ఎస్ కార్యకర్తలు సమన్వయంతో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు గడప గడపకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరు పని చేయాలని హుస్నాబాద్ ఎమ్మెల్యే వోడితల సతీష్ కుమార్ అన్నారు.శనివారం హుస్నాబాద్ మండలంలోని పోతారం గ్రామంలోని శుభం గార్డెన్ లో హుస్నాబాద్ మండల బీ ఆర్ ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే సతీష్ కుమార్ మాట్లాడారు నేను అందరిలా రాజకీయాలు మాట్లాడి, రాజకీయాలు చేసే నాయకున్ని కాదనీ అభివృద్దే నా ఎజెండా.. ప్రజా సంక్షేమం కోసమే నా తపన అభివృద్ధి, సంక్షేమం కోసం తప్ప రాజీ పడేది లేదని అన్నారు. ఎన్నో ఏండ్లుగా కరవుతో అల్లాడిన హుస్నాబాద్ ను పదేళ్లలో సి ఎం కేసీఆర్ కృషితో గోదావరి జలాలు తీసుకువచ్చి కరవును జయించామన్నారు. హుస్నాబాద్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకువెళ్తున్నానని, ప్రజల మరోసారి అవకాశం కల్పించేలా ఆశీర్వాదం ఇవ్వాలన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గాన్ని వైద్య,విద్యా, రోడ్లు, మౌలిక సదుపాయాలు ఎంతగానో తీర్చిదిద్దానని ,ఇది ప్రజల మద్దతుతో సాధ్యమైందని అన్నారు. నాలుగు జిల్లాలకు కేంద్రంగా హుస్నాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. గత ప్రభుత్వాలు గౌరవెల్లిని చేయలేకపోయామని, సంకల్పం, కృషి పట్టుదలతో గౌరవెల్లిని పూర్తి చేశామన్నారు.తెలంగాణ తెచ్చిన పార్టీ బీ ఆర్ ఎస్ అని, అభివృద్ధి సంక్షేమం విషయంలో ప్రజలకు సి ఎం కేసీఆర్ పై నమ్మకం విశ్వాసం ఉన్నాయని అందుకే రెండుసార్లు ప్రజలు అధికారం కట్టబెట్టారని, ప్రజల మద్దతుతో, గులాబీ సైనికుల కృషితో మూడోసారి రాష్ట్రంలో బీ ఆర్ ఎస్ అధికారం లోకి రావడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ రాజారెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న,బి ర్ఎస్ మండల అధ్యక్షుడు వంగ వెంకట్రామిరెడ్డి, పట్టణ అధ్యక్షుడు అన్వర్, ఎంపీపీ లకావత్ మానస సుభాష్, మార్కెట్ చైర్మన్ ఎడబోయిన రజిని తిరుపతిరెడ్డి, వివిధ గ్రామాల బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.