నవతెలంగాణ – ధర్మసాగర్
ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని ఆరోగ్య సమస్యలపై అవగాహన కలిగి ఉండాలనీ జిల్లా పరిషత్ ముఖ్య కార్య నిర్వహణాధికారి విద్యాలత అన్నారు. మంగళవారం సాధారణ తనిఖీలో భాగాంగా ప్రాధమిక ఆరోగ్య కేంద్రమును సందర్శించడము జరిగినది. ఈ సందర్భంగా మోడల్ కాలనిలో స్థానిక మెడికల్ ఆఫీసర్ గోపినాథ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెడికల్ క్యాంపును సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మందులు పరిశీలించి, అక్కడి ప్రజలకు పరిసరాల శుభ్రత గురించి తగు సూచనలు ఇవ్వడము జరిగినది. వారిని ఉద్దేశించి మాట్లాడుతూ ఎలాంటి జ్వరం వచ్చిన వెంటనే ప్రాధమిక ఆరోగ్య కేద్రములో చికిత్స తీసుకొనవలసినదిగా ప్రజలకు సూచించారు. అనంతరం సాయిపేట గ్రామ పంచాయీలో జిల్లా పరిషత్ , ప్రాధమిక , అంగన్వాడీ పాఠాశాలను పరిశీలించి మధ్యహన్నా భోజనమును రుచిచూడడము జరిగినది. పాఠాశాల పిల్లలకు ఇంకా మెరుగ్గా భోజనం అందించాలని వారికి సూచనలు జారీ చేయడము జరిగినది. అదేవిధంగా అమ్మ ఆదర్శ పాఠశాల పనులను పరిశీలించి ఆరోగ్యపై అందరూ శ్రద్ధ వహించాలని సూచించారు. ఈ కార్యక్రమములో డి. ఆర్. డి. ఓ కె. నాగపద్మజ, ఎం.పి.డి.ఓ., కె. అనిల్ కుమార్ గారు , ఎం.పి .ఓ., సయ్యద్ అప్జల్ గారు ఏ. పి. ఓ సంపత్ గారు , ఈజీఎస్ సిబ్బంది మరియు పంచాయతి కార్యదర్శులు ,అంగన్వాడీ కార్యకర్తలు , విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.