పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

Keep the surroundings cleanనవతెలంగాణ – బొమ్మలరామరం 

వ్యక్తిగత పరిశుభ్రత తో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మండల కేంద్రంలో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్వచ్ఛతాహి సేవా కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు.అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రజలు చుట్టుపక్కల పరిసరాల పరిశుభ్రత పై అవగాహన కల్పించారు.అన్ని రకాల వైద్య పరీక్షలు జరిపి మందులు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.ఇళ్ల చుట్టూ మురుగనీరు  చేరకుండా చూసుకోవాలన్నారు. మరుగునీరు చేరడం వల్ల ఈగలు దోమల వాలి మలేరియా డెంగు లాంటి ప్రాణాంతకారమైన వ్యాధులు సంభవించే ప్రభావం ఉందన్నారు. శుభ్రత ముఖ్యమన్నారు.ప్రాథమిక వైద్యాధికారి డాక్టర్ హర్ష ఎయిమ్స్ వైద్య అధికాలు డాక్టర్ వినయ్, వరుణ్, జిల్నిల్,హెల్త్ సూపర్వైజర్ జనార్ధన్ సుమతీ హెల్త్ అసిస్టెంట్ ప్రవీణ్ నూర్జహాన్, మండల సెక్రెటరీస్ పద్మజ, అమిత్, పవన్, వెన్నెల,పాల్గొన్నారు.