పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి– అదనపు వైద్యాధికారి కుడ్మెత మనోహర్‌
నవతెలంగాణ-ఇంద్రవెల్లి
వర్షాకాలంలో ప్రబలే వివిధ సీజనల్‌ వ్యాధుల నివారణకై పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అదనపు వైద్యాధికారి కుడ్మెత మనోహర్‌ సూచించారు. శుక్రవారం డ్రై డేలో భాగంగా మండల కేంద్రంలోని ఆశ్రమ పాఠశాల (బాలికలు)లో డ్రై డేను నిర్వహించారు. ఈ సందర్భంగా దోమల నివారణ మందును పిచికారి చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. వసతి గృహాల్లో అంటు వ్యాధులు ప్రబలకుండా మురుగుతో పాటు నీటిని నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తాగునీటి పథకాలకు క్లోరినేషన్‌ చేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది శ్రీనివాస్‌, తులసీదాస్‌ ఆశవర్కర్‌లు పాల్గొన్నారు.