
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎంపీడీవో శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం ఫ్రైడే డ్రై డే కార్యక్రమంలో భాగంగా మండలంలోని తాజ్పూర్, అనంతారం గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్తులు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎప్పటికప్పుడు పరిసరాలను శుభ్రంగా ఉండేవిధంగా చూసుకోవాలని సూచించారు. నిల్వ ఉన్న నీటిని తొలగించారు. పరిసరాల పరిశుభ్రత పై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ దినాకర్, పంచాయత్ కార్యదర్శి నర్సింగ్ రావు , ఆశ వర్కర్లు సిబ్బంది పాల్గొన్నారు.