పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే ప్రజలు ఎలాంటి రోగాల బారిన పడకుండా ఉంటారని, ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రతను అలవాటు చేసుకోవాలని జిల్లా పౌరశాఖ అధికారి, దుబ్బాక మండల ప్రత్యేక అధికారి తనుజ అన్నారు. మంగళవారం దుబ్బాకమండల పరిధిలోని పద్మనాభునిపల్లి , పోతారెడ్డి పేట, చిట్టాపూర్, తాళ్లపల్లి, రామేశ్వరంపల్లి, చిన్న నిజాంపేట గ్రామాలను జిల్లా పౌరశాఖ అధికారి, దుబ్బాక మండల ప్రత్యేక అధికారి తనుజ సందర్శించారు. అనంతరం గ్రామాలలో స్వచ్చదనం- పచ్చదనం కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు జరుగుతున్న పారిశుధ్యం పనులను పరిశీలించి, గ్రామాల్లో డ్రై డే నిర్వహించారు. గ్రామాలలో ఓ హెచ్ ఆర్ ట్యాంక్ లను శుభ్రం చేయించారు. నీటి తొట్టెలలో, కుండీలలో నీరు నిల్వ ఉండకుండా చుసుకోవాలన్నారు. ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత తప్పక పాటించాలన్నారు. వర్షం నీరు ఎక్కడ కూడా నిల్వ ఉండకుండా చూసుకోవలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ భాస్కర్ శర్మ, ఎంపిఓ నరేందర్ రెడ్డి, ఆయా పంచాయతీల గ్రామ కార్యదర్శిలు , తదితరులున్నారు.