భారీ వర్షాల మూలంగా ప్రతి గ్రామంలో గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని గ్రామ కార్యదర్శిలకు ఎంపీడీవో రాణి ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు శనివారం నాడు మండల పరిషత్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మద్నూర్ తాసిల్దార్ ఎండి ముజీబ్ డోంగ్లి, తాసిల్దార్ రేణుక చౌహన్ పంచాయతీరాజ్ ఏ ఈ ఇరిగేషన్ శాఖ ఏఈ ఉపాధి హామీ ప్రోగ్రాం అధికారి మద్నూర్ డోంగ్లి మండలాల గ్రామ కార్యదర్శులు పాల్గొన్న సమావేశంలో భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకొని అధికారులు అంతా అలర్ట్ గా ఉండాలని గ్రామాల్లో పురాతనమైన ఇండ్లు కూలిపోయిన వాటి గురించి సమాచారం సేకరించాలని గ్రామ ప్రజలకు త్రాగునీటి ఇబ్బందులు పరిశుభ్రత పట్ల గ్రామంలో రోడ్ల వ్యవస్థ నీటి ట్యాంకుల శుభ్రత ఎప్పటికప్పుడు ప్రత్యేక దృష్టితో చేపట్టాలని, గ్రామ కార్యదర్శులకు ఎంపీడీవో ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షాల కారణంగా సంబంధిత శాఖల అధికారులు అలర్ట్ గా ఉండాలని కోరారు. ఈ సమావేశంలో తాసిల్దార్లు ఇరు శాఖల ఏఈలు ఇరు మండలాల్లోని గ్రామ కార్యదర్శులు పాల్గొన్నారు.