పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత

నవతెలంగాణ- హుస్నాబాద్ రూరల్
ఇంటి చుట్టూ, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని హుస్నాబాద్ మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత అన్నారు. ఆదివారం హుస్నాబాద్ లో ఇండియన్ స్వచ్ఛత లీగ్ 2.0 కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం  నుండి గాంధీ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి టీ షర్ట్స్, క్యాప్స్, బ్యాడ్జీ లు పంపింణి చేశారు. ఈ సందర్భంగా ఆకుల రజిత వెంకన్న మాట్లాడుతూ పట్టణం  పరిశుభ్రంగా ఉండాలంటే ఎలాంటి చెత్తను రోడ్లపై, ఓపెన్ ప్లాట్లలో పడవేయకూడ వద్ద న్నారు. మీ ఇంట్లో ఉన్న చెత్తను, తడి, పొడి చెత్తగా వేరుచేసి మున్సిపల్ వాహనానికి అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్, అనిత శ్రీనివాస్ రెడ్డి, కమిషనర్ రాజశేఖర్ ,  కొంకటి నళిని,బొజు రమాదేవి రవీందర్ మున్సిపల్ అధికారులు ,వార్డ్ ఆఫీసర్లు, పారిశుద్ధ సిబ్బంది ,పట్టణ పుర ప్రముఖులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.