కీర్తి నరసయ్య మృతి బాధాకరం

నవతెలంగాణ- పెన్ పహాడ్: కీర్తి నరసయ్య మృతి బాధాకరమని మంత్రి, బీఆర్‌ఎస్‌ సూర్యాపేట నియోజకవర్గ అభ్యర్ది గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. మండల పరిధిలోని చీదేళ్ళ గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్‌ మండల సోషల్ మీడియా అద్యక్షుడు కీర్తి యలమంచయ్య తండ్రి కీర్తి నరసయ్య అనారోగ్యంతో సోమవారం రాత్రి మృతి చెందగా మంగళవారం వారి స్వగృహానికి విచ్చేసి నరసయ్య మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి  ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నెమ్మాది భిక్షం, సర్పంచ్ పరెడ్డి సీతారాంరెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ వెన్న సీతారాంరెడ్డి, ఎంపీటీసీ జూలకంటి వెంకటరెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షుడు కీర్తి వెంకటరాజు, నాయకులు మండాది నగేష్, చెన్ను శ్రీనివాసరెడ్డి, మిరియాల వెంకటేశ్వర్లు, తూముల ఇంద్రసేనారావు, నల్లపు శ్రీను, రణపంగ సైదులు తదితరులు పాల్గొన్నారు.