అశ్వారావుపేట మండల ఇంచార్జి విద్యాధికారి గా కీసరి లక్ష్మి గురువారం బాధ్యతలు స్వీకరించారు.అశ్వారావుపేట యం.ఇ.ఒ గా బాధ్యతలు నిర్వహించిన పి.కృష్ణయ్య కు ఇల్లందు విద్యాశాఖాధికారి గా అదనపు భాద్యతలు విధులు నిర్వహించడం కష్టంగా మారింది.ఇప్పటికే దమ్మపేట మండల విద్యాధికారిణి గా బాధ్యతలు నిర్వహిస్తున్న లక్ష్మి కి అశ్వారావుపేట ఎంఈఓ గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ జిల్లా విద్యాధికారి వెంకటేశ్వరాచారి ఉత్తర్వులు జారీ చేయడంతో నేడు బాధ్యతలు చేపట్టారు. ఈమెకు మండల విద్యాశాఖ కార్యాలయ సిబ్బంది,సి.ఆర్.పిలు,ఐ.ఇ.ఆర్.పిలు ఆహ్వానం పలికారు.