కోనరావుపేట మండలం నాగారం గ్రామానికి చెందినన్యాయవాది కీసరి శ్రీనివాస్ ఇప్పుడు తన న్యాయ సేవలో మరొక అడుగు ముందుకు వేశారు. మండలంలోని నాగారం గ్రామంలో ఓ వ్యవసాయ కుటుంబంలో జన్మించిన కీసరి శ్రీనివాస్ గత కొన్ని ఏళ్లుగా న్యాయవాదిగా పని చేస్తున్నారు. న్యాయసేవలో ఎంతోమందికి న్యాయ సలహాలు అందించడమే కాకుండా, న్యాయవాదిగా అనేక కేసుల్లో విజయం సాధించాడు. అతని క్రమశిక్షణ గుర్తించి, అనతి కాలంలోనే సిరిసిల్ల సీనియర్ సివిల్ జడ్జి, జూనియర్ సివిల్ జడ్జి కోర్టులకు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ గా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా శనివారం నియామకం చేశారు. గవర్నమెంట్ అసిస్టెంట్ ప్లీడర్గా కీసరి శ్రీనివాస్ నియమితులవ్వడం పట్ల మండల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.