జనాభా దామాషా ప్రకారం బీసీలకు బడ్జెట్ కేటాయించాలి అని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కెంపుల నాగరాజు అన్నారు. బీసీలలో కుల వృత్తులను నమ్ముకునే జీవనాధారం కోనసాగిస్తు ఉపాధి కల్పనకు, ఆర్థిక, సామాజిక పరిస్థితుల మెరుగుదలకు కులవృత్తులను ఆధునీకరించావలసిన అవశ్యకత ఉంది అని లేదంటే బీసీలు వెనుకబాటుకు గురవడం ఖాయం అని అన్నారు. ఈ పరిస్థితుల్లో 56శాతం జనాభా కలిగిన బీసీలకు, రూ.8వేల కోట్ల బడ్జెట్ కేటాయించడం చాలా తక్కువ అని, జనాభా దామాషా ప్రకారం రూ.56 వేల కోట్ల బడ్జెట్ కేటాయిస్తేనే, బీసీలకు న్యాయం జరుగుతుందని, బీసీ సబ్ ప్లాన్ అమలుతో లబ్ది చేకూరుతుందని, కొత్తగా బీసీ కార్పొరేషన్ల ఏర్పాటు జరుగుతుందని, అప్పుడే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, సంక్షేమ పథకాల అమలు సవ్యంగా సాగుతుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఈ దిశగా ఆలోచించి, బీసీలకు న్యాయం చేయాలని కోరారు