
మండలం పాలెం గ్రామంలో గురువారం మంత్రి పంపిణీ చేసిన ఇండ్ల స్థలాల పట్టాల పంపిణీ అధికార పార్టీ నేతలకే నా అంటూ పలువురు మహిళలు ఆరోపిస్తూ శుక్రారం తహసిల్దార్ కార్యాలయం తరలివచ్చారు. ఇండ్లు లేని నిరుపేదల లబ్ధిదారులను ఎంపిక చేసి అర్హులకు పట్టాలు ఇవ్వాల్సిన అధికారులు, అధికార పార్టీ నాయకులు చెప్పిన వారికే పట్టాలు పంపిణీ చేసేలా లబ్ధిదారుల ఎంపిక చేయడం జరిగిందని ఆరోపిస్తూ తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ తహసిల్దార్ కు వినతి పత్రాన్ని అందించారు. స్థానిక అధికార పార్టీ నేత కుటుంబానికి పట్టా పంపిణీతో పాటు ,బీసీ బందు, గృహ లక్ష్మీ పథకం వర్తింప చేయడం పట్ల అధికార పార్టీ నేతల హస్తం ఏ మేరకు ఉందని ఆరోపించారు. అధికార పార్టీ నేతలకే అభివృద్ధి పథకాలు పంపిణీ చేయడం సరికాదని, నిరుపేదలకు పంపిణీ చేయాల్సిన పథకలు అధికార పార్టీ నేతలకే పంపిణీ చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ తహసిల్దార్ కార్యాలయానికి తరలివచ్చి తమ నిరసనను తెలిపారు. అర్హులైన వారిని గుర్తించి అనరుల పేర్లను తొలగించాలని అధికారులను కోరారు. పంపిణీ చేసిన జాబితాను తొలగించి నూతన జాబితా ఎంపిక చేయకపోతే అధికార పార్టీ నేతల ఇంటిముందు నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. గత పది సంవత్సరాలుగా తమకు పట్టా సర్టిఫికెట్లు అందుతాయని ఆశపడ్డ అర్హులకు ఎంపిక చేయకుండా అధికార పార్టీ నేతలను ఎంపిక చేయడం ఎంత మేరకు సమజసమని ప్రశ్నించారు.