నవతెలంగాణ – కంఠేశ్వర్
నిజామాబాద్ అర్బన్ డేవలప్ మెంట్ అథార్టి చైర్మెన్ గా కేశ వేణు భాధ్యతలు స్వీకరించారు. ఆయనకు సోమవారం ఉదయం నుడా కార్యాలయంలో ఘన స్వాగతం లభించింది. నిజామాబాద్ నగర సినీయర్ నాయకులు, సిటి కాంగ్రెస్ ప్రెసిడేంట్ కేశ వేణు ఇటివల నుడా చైర్మెన్ గా నియమితులైన విషయం తెలిసిందే. 21న ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఉండటంతో నిజామాబాద్ నుడా కార్యాలయం( పాత మున్సిపల్ కార్పోరేషన్ కార్యలయం) వద్ద కేశవేణుకు ఆయన అనుచరులు ఘనస్వాగతం పలికారు.పటాకులు పేల్చి, డిజే చప్పుళ్లతో అంగరంగ వైభవంగా స్వాగతం పలికారు. నుడా చైర్మెన్ గా కేశ వేణు ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి జిల్లా ఇంచార్జీ మంత్రి జూపల్లి క్రిష్ణారావుతో పాటు ప్రభుత్వ సలహదారు షబ్బిర్ ఆలీ, మాజీ మంత్రి సుధర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, నాలుగు కార్పొరేషన్ల చైర్మెన్ లు వస్తుండటంతో కార్యలయంలో భారీగా ఎర్పాట్లు చేశారు. ఉదయం నుడా కార్యాలయంలో పూజా కార్యక్రమాలను నిర్వహించగా అందులో పాల్గోన్న కేశ వేణును పురోహితుల అశీర్వచనలను స్వీకరించి చైర్మెన్ కుర్చిలో అశీనులై భాధ్యతలు స్వీకరించారు. మద్యహ్నం ముఖ్య అతిథుల సమక్షంలో కేశ వేణు నుడా చైర్మెన్ గా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా నగర కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మిత్రులు శ్రేయోభిలాషులు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.