నవతెలంగాణ – పెద్దవంగర
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కుటుంబాలకు అన్ని విధాల అండగా ఉంటామని టీపీసీసీ మాజీ సభ్యులు కేతిరెడ్డి నిరంజన్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మామిడాల తిరుపతి రెడ్డి అన్నారు. రెడ్డికుంట తండా కు చెందిన బానోత్ భిచ్య నాయక్ (78) ఇటీవల మృతి చెందారు. ఆదివారం తండాలో నిర్వహించిన దశదిన కార్యక్రమంలో పాల్గొని పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యకర్తలే పట్టుకొమ్మలని, పార్టీ కోసం అహర్నిశలు గా పని చేసిన కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని చెప్పారు. మృతుడి కుటుంబ సభ్యులు భికోజి, యాకు, వెంకటేష్ లను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వారి వెంట హనుమండ్ల నరేందర్ రెడ్డి, కిషన్ యాదవ్, మాజీ సర్పంచ్ బానోత్ జగ్గా నాయక్, ఎంపీటీసీ బానోత్ రవీందర్ నాయక్, కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి పొడిశెట్టి సైదులు గౌడ్, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు బానోత్ సీతారాం నాయక్, బానోత్ గోపాల్, శంకర్ నాయక్, సుధాకర్, నరేందర్ తదితరులు ఉన్నారు.