
పట్టణ పద్మశాలీల ముఖ్య నాయకులు మాజీ కౌన్సిలర్ గుద్దేటి రమేష్ , పట్టణ పద్మశాలీల సంఘం(8 తర్పల) అధ్యక్షులు అంబల్ల శ్రీనివాస్ , మాజీ వార్డు సభ్యులు (8 తర్పల) అద్యక్షులు గుద్దేటి డిష్ రాము , నియోజకవర్గ పద్మశాలీల సంఘం అధ్యక్షులు దాసరి అనిల్ తదితరులు శుక్రవారం మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్, మాజీ విప్ అనిల్ ఈరవత్రి , నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి,సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది .ఈ కార్యక్రమం లో మున్సిపల్ చైర్మన్ అయ్యప్ప శ్రీనివాస్ ,మాజీ మున్సిపల్ చైర్మన్ పండిత్ పవన్ , పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సాయిబాబా గౌడ్ ,కౌన్సిలర్లు శాల ప్రసాద్ ,కొంత మురళి, మాజీ సర్పంచ్ సదాశివ్, మాజి కౌన్సిలర్ మహమూద్ అలీ, కాంగ్రెస్ నాయకులు జిమ్మి రవి ,అజ్జు బాయ్ ,రాజు భాయ్ ,చిట్టి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.