హీరో అజిత్ కుమార్‌తో మైత్రీ మూవీ మేకర్స్ రూపొందిస్తున్న బిగ్గెస్ట్ ఎంటర్టైనర్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. ఈ తెలుగు-తమిళ ద్విభాషా చిత్రానికి ఆదిక్ రవిచంద్రన్ రచన, దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అజిత్ కుమార్‌ని మూడు డిఫరెంట్ ఎక్స్‌ప్రెషన్స్‌లో ప్రజెంట్ చేసిన ఈ పోస్టర్ హ్యూజ్ బజ్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ షెడ్యూల్లో అజిత్ కుమార్, ఇతర నటీనటులపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రం 2025 సంక్రాంతికి విడుదల కానుంది. అజిత్ అభిమానులకు, ఆడియన్స్‌కు గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్‌ని అందించడానికి ఈ సినిమా రెడీ అవుతోంది. ఈ చిత్రానికి రచన – దర్శకత్వం: ఆదిక్ రవిచంద్రన్, డీవోపీ: అభినందన్ రామానుజం, సంగీతం: దేవి శ్రీ ప్రసాద్, ఎడిటర్: విజరు వేలుకుట్టి, ప్రొడక్షన్ డిజైనర్: జి ఎం శేఖర్, స్టంట్స్: సుప్రీం సుందర్, కలోయన్ వోడెనిచరోవ్.