కెజీబీవీలో ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ ప్రారంభం..

– కాస్టూబ్బా గాంధీ పాఠశాల స్పెషల్ అధికారి వెన్నెల
నవతెలంగాణ – మల్హర్ రావు

మండలంలోని దుబ్బపేట గ్రామపరిదిలో ఉన్న కస్తూర్బా గాంధీ ఆశ్రమ ప్రభుత్వ బాలికల విద్యాలయంలోని ఇంటర్మీడియట్ కళాశాలలో సిఈసి,ఎంపీహెచ్ డబ్ల్యూ తదితర కోర్సుల కొరకు అడ్మిషన్స్ ప్రారంభమైనట్లుగా పాఠశాల స్పెషల్ అధికారి వెన్నెల తెలిపారు.సోమవారం పాఠశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు మండలంలోని పదవ తరగతి పూర్తి చేసిన బాలికలు ఇంటర్మీడియట్ సిఈసి,ఎంపీహెచ్ డబ్ల్యూ కోర్సుల్లో చేరడానికి ఆసక్తి వున్నవారు సంప్రదించాలని కోరారు.బాలికలకు హాస్టల్ వసతితో పాటు,అనుభవజ్ఞులైన అధ్యాపకనియలచే నాణ్యత బోధన, డిజిటల్ క్లాసురూమ్స్ అందుబాటులో ఉన్నాయన్నారు.ప్రవేశాలకు ఫోన్ 6281389147 నెంబర్ ను సంప్రదించాలని కోరారు.