– కరాటే మాస్టర్ కేజీబీవీ కమల
నవతెలంగాణ-వెల్దుర్తి
నర్సాపూర్ నియోజకవర్గంలోని శ్రీనివాస గార్డెన్లో కుంగ్ఫ్యూ లెజెండ్ మాస్టర్ బూమ్ రెడ్డి జ్ఞాపకార్థం ఆదివారం ఐదవ నేషనల్ లెవెల్ కరాటే టోర్నమెంటు నిర్వహించారు. ఈ టోర్నమెట్లో వెల్దుర్తి కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల విద్యార్థులు 38 మంది తమ ప్రతిభను కనబర్చి బహుమతులు పొందారని పాఠశాల కరాటే మాస్టర్ కమల తెలిపారు. కరాటే పోటీల్లో 38 మంది పాల్గొని అపజయమే లేకుండా పథకాలు సాధించారన్నారు. అందులో 25 గోల్డ్ ప్రథమ బహుమతులు ఎనిమిది వెండి ద్వితీయ బహుమతులు ఐదు తతీయ బహుమతులు సాధించారన్నారు. పాఠశాల స్పెషల్ ఆఫీసర్ ఫాతిమా బేగం పాఠశాల ఉపాధ్యాయ బృందం గ్రాండ్ మాస్టర్ హరి ప్రసాద్, ప్రజాప్రతినిధులు, అధికారులు విద్యార్థులను, కరాటే మాస్టర్ కమలను అభినందించారు.