
కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను రెగ్యులర్ చేయాలని ఎస్ టీ యు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అయిన శిరుప సతీష్ కుమార్ ఏళ్ల మధుసూదన్ లు అన్నారు. గురువారం మండలంలోని చలువాయి గ్రామంలో ఉన్న కేజీబీవీ పాఠశాలలో ఎస్ టి యు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శిరుప సతీష్ కుమార్, ఏళ్ళ మధుసూదన్ మాట్లాడుతూ కేజీబీవీ ఉపాధ్యాయులు రెగ్యులర్ ఉపాధ్యాయుల తో సమానంగా తమ విధులను నిర్వహిస్తూ విద్యార్థుల ప్రగతి కి ఎంతో కష్టపడుతున్న వారికి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని దానిలో భాగంగా గతంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు వారిని రెగ్యులరైజ్ చేయాలి అని డిమాండ్ చేశారు. విద్యారంగా ఉపాధ్యాయ సమస్యల కోసం ఎస్ టి యు నిరంతరం పోరాటం చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ములుగు మండల ప్రధాన కార్యదర్శి దాసరి రామ్మూర్తి, పాఠశాల స్పెషల్ ఆఫీసర్ వెంకటలక్ష్మి ఉపాధ్యాయినిలు జే రమాదేవి ఉదయశ్రీ, గంగా, సరితా , బి. రమాదేవి, శైలజ, సుజాత, శివాని తదితరులు పాల్గొన్నారు,