ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లికి కేజీకేఎస్‌ శుభాకాంక్షలు

Jupally Krishna raoనవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్ర నూతన ఎక్సైజ్‌ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన జూపల్లి కృష్ణారావుకు కల్లుగీత కార్మిక సంఘం అభినందనలు తెలిపింది. రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎంవీ రమణ, బెల్లకొండ వెంకటేశ్వర్లు గురువారం సచివాలయంలోని మంత్రి చాంబర్‌లో కలిసి శుభాకాంక్షలు తెలిపారు.కల్లుగీత కార్మికులకు ఎన్నికల ప్రణాళికలో ప్రకటించిన హామీలను అమలు చేయాలని ఈ సందర్భంగా వారు మంత్రికి విజ్ఞప్తి చేశారు.