
నవతెలంగాణ – కంఠేశ్వర్
రమేష్ బిదౌరి ప్రియాంక గాంధీ పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా యూత్ కాంగ్రెస్ నగర అధ్యక్షులు మోయిన్ అధ్యక్షతన చేపట్టిన నిరసన కార్యక్రమంలో కార్పొరేటర్ గడుగు రోహిత్, ఎన్ఎస్ యుఐజిల్లా అధ్యక్షులు వేణు రాజ్,సేవాదళ్ యువజన విభాగం అధ్యక్షుడు హర్షద్ పాల్గొన్నారు. ముందుగా వారు భరతమాత చిత్రపటాన్ని పట్టుకొని బిజెపికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం యూత్ కాంగ్రెస్ నగర అధ్యక్షులు మొయినుద్దీన్,కార్పొరేటర్ గడుగు రోహిత్ , ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు వేణు రాజ్ సేవాదళ్ యువజన విభాగం అధ్యక్షుడు హర్షద్ , నవాజ్, మాట్లాడుతూ రమేష్ బిదౌరి అనే సంస్కారం లేని నీచుడు మా నాయకురాలైన ప్రియాంక గాంధీ పై చేసిన అనుచిత వ్యాఖ్యలు బిజెపి నాయకులకు స్త్రీల పట్ల వారికి ఉన్న కుసంస్కారాన్ని మరోసారి బట్టబయలు చేసిందని బిజెపి పార్టీ అంటేనే హత్యలు మానభంగాలు దోపిడీలు చేసేవారని వారు దేశం గురించి ధర్మం గురించి మహిళల గురించి మాట్లాడడం సిగ్గుచేటు అని వారు అన్నారు. రమేష్ బిదౌరి ప్రియాంక గాంధీ పై చేసిన వ్యాఖ్యలను యావత్ భారతదేశం మొత్తం ఖండిస్తుందని బిజెపి పార్టీలకు మహిళల పట్ల ఎలాంటి గౌరవం ఉండదని గతంలో అత్యాచారం చేసిన చాలామంది వ్యక్తులకు బిజెపి పార్టీ ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా కేంద్ర మంత్రులుగా టికెట్లు ఇచ్చి మరి ప్రోత్సహించిందని అలాంటి వ్యక్తులకు మహిళల పట్ల గౌరవం ఎలా ఉంటుందని వారు అన్నారు.
పైగా బీజేపీ నాయకులు భరతమాత ముద్దు బిడ్డలం అని చెప్పుకుంటున్నారని భరతమాత అసలు ముద్దు బిడ్డలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని, కాంగ్రెస్ పార్టీ అంటే కులమతాలకు అతీతంగా సామరస్యంతో ఉండే పార్టీ అని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త స్త్రీని ఒక తల్లిలా చెల్లెలా భావిస్తారని బిజెపి నాయకుల లాగా స్త్రీపై చులకన భావంతో ఉంటూ చౌకబారు వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ కార్యకర్తలకు నాయకులకు తెలియదని వారు అన్నారు. బిజెపి నాయకులు రమేష్ బీదౌరి చేసిన వ్యాఖ్యలకు ఏమాత్రం పశ్చాత్తాప పడకుండా సిగ్గు లేకుండా నిన్న హైదరాబాద్ లో నిరసన కార్యక్రమం చేసిన మా యూత్ కాంగ్రెస్ సోదరులపై దాడి చేయడమే కాకుండా ఇవాళ నిజామాబాద్ ఆఫీస్ ముట్టడికి యత్నించారని కేవలం మేము ప్రభుత్వంలో ఉన్నామని బాధ్యతాయుతంగా వ్యవహరించి మా నాయకులు ఇచ్చిన సందేశంతో సంయమనంతో ఉన్నామని లేకుంటే ఒక్క బిజెపి నాయకుడు కూడా రోడ్డుపై తిరగకుండా చేస్తామని వారు హెచ్చరించారు. ఇంకోసారి ఎవరైనా బిజెపి నాయకుడు స్త్రీల పట్ల గాని కాంగ్రెస్ నాయకురాల పట్ల గాని నోరు జారి తప్పుడుగా మాట్లాడితే నాలుకలు చీరేస్తాం ఖబర్దార్ అని వారు హెచ్చరించారు.తక్షణమే బిజెపి పార్టీ హై కమాండ్ రమేష్ బీదౌరి ని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని అలాగే బిజెపి పార్టీ అగ్ర నాయకులు రమేష్ బీదౌరి చేసిన వ్యాఖ్యలకు సంపూర్ణ బాధ్యత వహించి ప్రియాంక గాంధీకి క్షమాపణ చెప్పాలని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్, ఎన్ ఎస్ యు ఐ నాయకులు రషీద్, పవన్ కాక , అక్రమ్, సాయికిరణ్, శివ, రేవంత్, ముదస్సిర్, అతీఫ్, మినాజ్, పాల్గొన్నారు.