– బీఆర్‌ఎస్ యువజన విభాగం నాయకులు
నవతెలంగాణ-తాండూరు
నిక్కాసైనా బీసీలందరూ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి వెంబడి ఉన్నారని బీఆర్‌ఎస్ పార్టీ బీసీ సంఘం సభ్యులు, బీఆర్‌ఎస్ పార్టీ యువజన సంఘం నాయకులు అన్నారు. కాంగ్రెస్ నాయకులు లేనిపోని ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని ఈ సందర్భంగా హెచ్చరించారు.ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి బీసీల కోసం అహర్నిశలు శ్రమించే వ్యక్తిత్వం గల వ్యక్తి అలాగే దశాబ్దాలుగా నోచుకోనటువంటి బిసి సమీకత భవనం మంజూరు చేయడం జరిగిందన్నారు. బిసి ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సమచిత స్థానం ఇస్తూ అన్ని వర్గాలకు ఒకలా చూస్తున్న వ్యక్తి గౌరవ ఎమ్మెల్యే అని తెలిపారు. జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో పట్టణ బీఆర్‌ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సంతోష్ గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్ వెంకన్న గౌడ్, బీసీ సంఘం ప్రధాన కార్యదర్శి చంటి యాదవ్, మంబాపూర్ సర్పంచ్ శ్రావణ్, బిసి నాయకులు యోగానంద్, చెన్ బసప్ప,రజక నరసింహ, బషీరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు కష్ణ ముదిరాజ్,తదితరులు పాల్గొన్నారు.