నవతెలంగాణ- తుంగతుర్తి
ప్రజాస్వామ్యాన్ని, ప్రజాతీర్పు
ను గౌరవించకుండా రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్ పై గాదరి అనుచిత వ్యాఖ్యలు సబబు కాదని ఎన్ ఎస్ యు ఐ తుంగతుర్తి అసెంబ్లీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నాల సృజన్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గాదరికి అధికారం కోల్పోయిన అహంకారం తగ్గలేదని అన్నారు.విద్యార్థి ఉద్యమ నాయకుడిగా చెప్పుకునే గాదరి కిషోర్ పది సంవత్సరాలు ప్రజాప్రతినిధిగా ఉండి ఎన్ని ప్రభుత్వ ఇంటర్ డిగ్రీ కాలేజీలు తీసుకొచ్చారో చెప్పాలని అన్నారు. నియోజకవర్గంలోని రోడ్లన్నీ అద్వానంగా ఉన్నాయని ఇసుక దందా భూదంద చేసి ప్రశ్నించిన వాళ్ల మీద ప్రైవేటు సైన్యంతో దాడులు చేయడం గాదరి నైజం అని అన్నారు. నియోజకవర్గం ఏర్పడిన నాటినుండి నేటి వరకు ఇంత వ్యతిరేకత ఎవరి మీద లేదని అందుకే 50 వేల పైచిలుక ఓట్ల ప్రజలు ఓడించి తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. దొంగ నోట్లతో అక్రమ సంపాదనతో వందల కోట్లు గడించిన అహంకారంతో 10 నెలల్లో మళ్లీ తానే ఎమ్మెల్యేను అంటూ మాట్లాడడం ఆయన నియంతృత్వానికి నిదర్శనం అన్నారు. ఉద్యమ నేత అయిన మందుల సామేల్ కు ఏమైనా గాదరిది బాధ్యత అని అన్నారు. గాదరి కిషోర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు.