– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం సంతాపం
నవతెలంగాణ – చండూరు
ఖమ్మం గాలయ్య ఆశయ సాధన ప్రతి ఒక్కరు కృషి చేయాలని, ఆయన మృతి సీపీఐ(ఎం) పార్టీకి తీరని లోటని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బండ శ్రీశైలం అన్నారు. ఆదివారం ఉదయం గట్టుపల్ మండల కేంద్రంలోఉదయం 8 గంటల ప్రాంతంలో ఖమ్మం గాలయ్య (58) అనారోగ్యంతోమరణించారు. ఈ విషయం తెలుసుకున్న సీపీఐ(ఎం) నాయకులు ఆయన భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గాలయ్య చనిపోవడం చాలా బాధాకరమనిఆయన అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడే వారని వారు కొనియాడరు. గాలయ్య అనేక ఉద్యమాలలో కీలక పాత్ర పోషించే వారని ఆయన అన్నారు. నమ్మిన సిద్ధాంతం కోసంచివరి శ్వాస విడిచి వరకు ఎర్రజెండా పక్షాన పోరాడిన వ్యక్తి గాలయ్య అని ఆయన అన్నారు. ఆయన ఆశయ సాధన కోసంప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) గట్టుపల మండల కార్యదర్శికర్నాటి మల్లేశం, కెవిపిఎఫ్ రాష్ట్ర కమిటీ సభ్యులు బొట్టు శివకుమార్, సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యులు కర్నాటి సుధాకర్,తెరటుపల్లి మాజీ సర్పంచ్ మల్గే శ్రీశైలం, చేతివృత్తిదారుల సంఘం మునుగోడు నియోజకవర్గం అధ్యక్షులు కర్నాటి వెంకటేశం, సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు ఎండి రబ్బాని, సీపీఐ(ఎం) నాయకులుకక్కునూరు నాగేష్, పసుపుల చెన్నయ్య, ముసుకు బుచ్చిరెడ్డి, ఖమ్మం రాములు, పసుపుల తిరుపతయ్య, పసుపుల రాములు, కిన్నెర బిక్షమయ్య, ఖమ్మం రాకేష్, కర్నాటి యాదయ్య, ఖమ్మం మల్లేష్, మొద్దు గాలయ్య, ఖమ్మం అబ్బయ్య, విశ్వనాథ చారితదితరులు పాల్గొన్నారు.