ఖమ్మం పార్లమెంట్‌ స్థానం బీఆర్‌ఎస్‌దే

– విస్తృత పర్యటనలో ఎంపీపీ జల్లిపల్లి
నవతెలంగాణ-అశ్వారావుపేట
రాబోవు ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్‌ స్థానం గెలుచుకునే బీఆర్‌ఎస్‌ మాత్రమేనని, అభ్యర్ధి నామ నాగేశ్వరరావు విజయమే లక్ష్యంగా ప్రతీ కార్యకర్త నడుం బిగించాలని ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ మూర్తి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సోమవారం అశ్వారావుపేట నియోజకవర్గం, అశ్వారావుపేట మండలంలో ఊట్లపల్లి, వినాయక పురం, ఆసుపాక, నందిపాడు, వడ్డి రంగా పురం, గుమ్మడవల్లి, బచ్చు వారి గూడెం పంచాయతీలో పార్టీ ముఖ్య నాయకుల బృందం విస్తృత పర్యటన చేసారు. నామ నాగేశ్వర రావు గెలుపే లక్ష్యంగా బూత్‌ లెవల్‌ కమిటీలను ఏర్పాటు చేసి ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్‌ నారాయణపురం ఉపాధ్యక్షులు పుట్ట సత్యం, జెడ్పీటీసీ పూర్వ సభ్యులు జూపల్లి కోదండ వెంకట రమణారావు, మాజీ వైస్‌ ఎంపీపీ మందపాటి రాజమోహన్‌ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి యుఎస్‌ ప్రకాష్‌ రావు, మండల కార్యదర్శి జుజ్జూరపు వెంకన్న బాబు,బిర్రం వెంకటేశ్వరరావు, నాయకులు పాల్గొన్నారు.