తమిళనాడులో ‘ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌’

–  ప్రధానిని ఆహ్వానించనున్న ఉదయనిధి స్టాలిన్‌
చెన్నై : తమిళనాడులో ఈ నెలలో జరగనున్న ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌ను పురస్కరించుకొని ప్రధాని మోడీని ఆ రాష్ట్ర క్రీడా మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ ఆహ్వానించనున్నారు. ఈ మేరకు ఆయన నేడు ఢిల్లీకి వెళ్లి మోడీని కలవనున్నారు. ఈ విషయాన్ని ఉదయనిధి స్టాలిన్‌ వెల్లడించారు. ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌ తొలిసారిగా తమిళనాడులో జరుగుతున్నాయి. ఈ నెల 19 నుంచి 31వరకు ఈ గేమ్స్‌ జరగనున్నట్టు ఉదయనిధి స్టాలిన్‌ తెలిపారు. తాను వెళ్లి ప్రధానిని ఆహ్వానిస్తాననీ, రావటం.. రాకపోవటమనేది ఆయన ఇష్టమని చెప్పారు. తూత్తుకుడితో పాటు దక్షిణాధి ప్రాంతాల్లో వర్షాలు, వరదల నష్టాన్ని అంచనా వేయటానికి తమిళనాడులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పర్యటన అనంతరం ఆమె నిధులు విడుదల చేస్తారనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.