సెగలేని పొయ్యిమీద పెనం పెట్టి గుండ్రంగా
అందంగా రొట్టె చేసి సుతారంగా అటూ ఇటూ
చొంగకారుస్తూ కాలుస్తున్నాడు
అటు రాజ్యానికి ఇటు ప్రజలకూ
వివాదం కాని నినాదం ఒకటి
మనిషి ఉద్యోగము సద్యోగం
భూమి గాలి అడవి వనరు ఒనరు
రాజకీయంలో సర్దుబాటు అవుతూనే
చంద్రుని గుట్టుతెలిసిన తర్వాత
వెన్నెల వన్నెలను కీర్తిస్తుంటాడు
ప్రశ్నను పోగొట్టుకొని
ఉత్తుత్తగానే వెతికినట్టు చేస్తుంటాడు
చుట్టు చుట్టూ తిప్పి తీరా అంటుకోని స్టవ్ మంట మీద
పోషకాలు లేని వంట చేసి
అవకాశ అసలైన రాజకీయం
లొట్టలేసుకుంటూ వడ్డిస్తుంటాడు
– జూకంటి జగన్నాథం