ఇటీవల వెలువడిన తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్ సొసైటీ ఫిజికల్ డైరెక్టర్ ఫలితాల్లో ఫతేపూర్ గ్రామానికి చెందిన సీనియర్ ఖో ఖో క్రీడాకారుడు చౌహన్ శ్రీనివాస్ ఎంపికై మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి చేతులమీదుగా నియామక పత్రాన్ని అందుకోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ నిజామాబాద్ బాయ్స్ 2 లో జాయిన్ కావడం జరిగింది అని నిజామాబాద్ జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు విద్యాసాగర్ రెడ్డి తెలియజేశారు. ఎన్నో జాతీయస్థాయి ఖో ఖో క్రీడల్లో పాల్గొని తెలంగాణ జట్టుకు గోల్డ్ మెడలో అందించిన క్రీడాకారుడు చౌహన్ శ్రీనివాసును జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు టీ.విద్యాసాగర్ రెడ్డి, జిల్లా కబడ్డీ సంఘం ఉపాధ్యక్షులు శ్రావణ్ రెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయ సంఘం కోశాధికారి ఎం రాజేందర్, వ్యాయమ ఉపాధ్యాయులు జక్క రాజేశ్వర్, వ్యాయమ ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు, సీనియర్ ఖో ఖో క్రీడాకారులు అభినందించారు.