కియా కుర్రో..మొర్రో

కియా కుర్రో..మొర్రో–  నాలుగు వేల పైగా కార్లలో లోపాలు
న్యూఢిల్లీ : కియా ఇండియా తన నాలుగు వేల పైగా సెల్టోస్‌ ఎస్‌యువి కార్లలో లోపాలు ఉన్నట్లు గుర్తించింది. 4,358 యూనిట్ల సివిటి వర్షన్‌ కార్లను రీకాల్‌ చేస్తున్నట్లు కియా ఇండియా శుక్రవారం తెలిపింది. వీటిలోని ఎలక్ట్రానిక్‌ ఆయిల్‌ పంప్‌ కంట్రోలర్‌లో లోపాలు ఉన్నట్లు గుర్తించింది. దీన్ని మార్చేందుకు రీకాల్‌ చేస్తున్నట్లు తెలిపింది. గతేడాది ఫిబ్రవరి 28 నుంచి జులై 13 మధ్య తయారైన సివిటి వర్షన్‌ కార్లను రీకాల్‌ చేస్తున్నామని వెల్లడించింది. వీటిని స్వచ్ఛందంగా రీకాల్‌ చేస్తున్నామని, ఉచితంగా ఎలక్ట్రానిక్‌ ఆయిల్‌ పంప్‌ కంట్రోలర్‌ను మార్చి ఇవ్వనున్నట్లు పేర్కొంది.