న్యూఢిల్లీ : కియా ఇండియా తన సెల్టోస్‌ను సరికొత్త అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్ (అడాస్)-2 ఫీచర్‌తో విడుదల చేసినట్లు ప్రకటించింది. భద్రతకు కొత్త ప్రమాణామని.. ఆధునిక టెక్నాలజీలో వివిధ ఇంటిలిజెంట్ ఫీచర్స్ కోసం ఆధునిక ఫార్వర్డ్ కొలిజన్ నివారించే అసిస్ట్, లేన్ కీప్ అసిస్ట్, స్టాప్ అండ్ గోతో స్మార్ట్ క్రూయిజ్ కంట్రోల్ సహా 1 కెమేరా, 3 రాడార్స్‌తో డ్రైవర్‌కు, ప్రయాణికులకు ఒకే విధంగా భద్రతను కలిగిస్తుందని తెలిపింది. నూతన సెల్టోస్ వాహన ధరల శ్రేణీని రూ.10.89 – రూ.19.99 లక్షలుగా పేర్కొంది.