కియా సెల్టోస్‌ ఐదు లక్షల యూనిట్ల అమ్మకాలు

న్యూఢిల్లీ : కియా ఇండియాకు చెందిన ఎస్‌యూవీ సెల్టోస్‌ కేవలం 46 నెలల్లో ఐదు లక్షల యూనిట్ల అమ్మకాల మైలురాయిని చేరినట్టు వెల్ల డించింది. ఆగస్ట్‌ 2019లో భారత్‌లో తమ ప్రయాణాన్ని ప్రారంభించినట్టు ఆ కంపెనీ తెలిపింది. స్వల్ప కాలంలోనే రికార్డ్‌ అమ్మకాలతో దేశంలో గర్వకారణంగా నిలిచినట్టు పేర్కొంది. ఇది వినియోగదారుల నమ్మకం, మనస్సును దోచుకుందని అభిప్రాయపడింది. మిడిల్‌ ఈస్ట్‌, ఆఫ్రికా, మధ్య దక్షిణ అమెరికా, మెక్సికో, ఆసియా పసిఫిక్‌ ప్రాంతం సహా సుమారు 100 విదేశీ మార్కెట్స్‌కు ఎగుమతి చేస్తున్నట్టు తెలిపింది.