అపహరణకు గురైన బాలిక

నవతెలంగాణ – అశ్వారావుపేట

ఓ మైనర్ బాలిక అపహరణకు గురి కాగా, పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానిక అదనపు ఎస్ఐ శివరామకృష్ణ కథనం ప్రకారం మండలంలోని ఓ గ్రామానికి చెందిన మైనర్ బాలికను ఈనెల 25 వ తేదిన ఇంట్లో ఉంచి, తల్లిదండ్రులు కూలీ పనులు చేసేందుకు వెళ్లారు.కూలీ పనులు చూసుకొని సాయంత్రానికి ఇంటికి వచ్చేసరికి బాలిక కనిపించకుండా పోయింది.దాంతో బంధువులు,స్నేహితుల ఇళ్ల వద్ద గాలించినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో మంగళవారం పోలీస్ స్టేషన్లో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీనిపై కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.