నవతెలంగాణ – మిరు దొడ్డి
మండల కేంద్రమైన మిడిదొడ్డిలో పిల్లల కిడ్నాప్ కలకలం రేపింది. శుక్రవారం మిడిదొడ్డిలో సుమారు 42 సంవత్సరాల వయసు కలిగిన ఓ మహిళ అనుమాన స్పదంగా తిరుగుతూ రెండో వార్డులోని ఓ పిల్లాడిని పలకరిస్తూ చేయిపట్టు కుండడానికి గమనించిన స్థానికులు ఆ మహిళను నిలదీశారు. అసలే పిల్లలను కిడ్నాప్ చేస్తున్నారన్న విషయం సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లలను కిడ్నాప్ చేయడానికి వచ్చిందేమో అని అంటూ స్థానికులు ఆమెపై ప్రశ్నల వర్షం సందించారు. దీంతో పొంతనలేని సమాధానం ఇస్తుండటంతో స్థానికులు ఆగ్రహంతో అట్టి మహిళను చితకబాదారు. విషయం తెలుసుకున్న మిరుదొడ్డి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మహిళను అదుపులోకి తీసుకున్నారు. బైక్ పై మహిళను పోలీస్ స్టేషన్కు తరలించి విచారించారు. విచారణలో మండల పరిధిలోని కాసాలాబాద్ బుడగ జంగం కులానికి చెందిన బాలసంత యాదమ్మగా పోలీసులు గుర్తించారు. విచారణలో పోలీసులు అసలు విషయాన్ని వెల్లడించారు. గ్రామానికి చెందిన బాలసంత ముత్తయ్య యాదమ్మ భార్య భర్తలు. శుక్రవారం భార్య భర్తల మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరిగింది దీంతో భర్త ముత్తయ్య పై ఉన్న కోపంతో తన తల్లిగారయిన తొగుట మండలం గుడికందులకు మిడిదొడ్డి మీదుగా కాలినడకన బయలుదేరింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న యాదమ్మ మిరుదొడ్డి రెండో వార్డులోని ఓ పిల్లాడిని అటకాయించి చేయి పట్టుకుంది. దీంతో స్థానికులు అనుమానంతో పిల్లలను కిడ్నాప్ కు యత్నిస్తుందేమోనని చితకబాది పోలీసులకు అప్పగించారు. పోలీసుల పూర్తి విచారణ అనంతరం యాదమ్మను భర్త ముత్తయ్యకు అప్పగించారు.