ఆందోళన కలిగిస్తున్న కిడ్నీ సంబంధ వ్యాధులు

– లక్టికాపూల్‌ గ్లెనిగల్స్‌ హాస్పిటల్‌లో అవగాహనా కార్యక్రమం
నవతెలంగాణ-సిటీబ్యూరో
రోజురోజుకూ కిడ్నీ సంబంధిత వ్యాధులు ఆందోళన కలిగిస్తున్నాయని గ్రైనిగల్ఫ్‌ హాస్పిటల్స్‌లో సీనియర్‌ కన్సÛల్టెంట్‌ తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న కిడ్నీ సంబంధ వ్యాధుల పట్ల అవగాహన కల్పించంతో పాటు వరల్డ్‌ కిడ్నీ డే సందర్భంగా ఈ సంవత్సరం అందరికి కిడ్నీ ఆరోగ్యం అనే థీమ్‌ వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ ప్రకటించిన నేపథ్యంలో లక్టీకాపూల్‌లోని’ గ్రైనిగల్ఫ్‌ హాస్పిటల్స్‌లో సీనియర్‌ కన్ఫల్టెంట్‌ నెప్రాలజిస్ట్‌ డాక్టర్‌ ప్రదీస్‌ దేశ్‌పాండే, సీనియర్‌ కన్సల్టెంట్‌ నెప్రాలజిస్ట్‌ అండ్‌ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌ ఫిజీషియన్‌ డాక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ ఎట్టా, సీనియర్‌ కన్ఫల్టెంట్‌ నెప్రాలజిస్ట్‌ అండ్‌ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌ ఫిజీషియన్‌ డాక్టర్‌ వి.ధనలక్ష్మిల ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. రోజు రోజుకూ పెరుగుతున్న కిడ్నీ సంబంధ వ్యాధులను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ కిడ్నీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త పడాలని, మన శరీరంలో రక్తం నుంచి వ్యర్థాలను, అదనంగా ఉండే ద్రవాలను శుభ్రపర్చే కీలకమైన అవయవం కిడ్నీలు. కిడ్నీ సమస్యలు తలెత్తి పూర్తిగా పనిచేయకుండా పోతే తీవ్రమైన సమస్యలకు దారితీస్తుందని తెలిపారు. పౌష్టిక అహారం తీసుకోవడం, వ్యాయామం చేస్తూ ధూమపానానికి దూరంగా ఉండటంతో పాటు కిడ్నీ సంబంధ వ్యాధులను ముందుగానే గుర్తించి చికిత్స తీసుకోవడంతో కిడ్నీలను కాపాడుకోవచ్చని తెలిపారు.
క్రానిక్‌ కిడ్నీ డిసీజ్‌ (సికెడి) ప్రపంచ వ్యాప్తంగా. 850 మిలియన్ల మంది బాధపడుతున్నారని, 2019లో 3.1 మిలియన్లకు పైగా మరణాలకు సికెడి కారణమైందని తెలిపారు. కిడ్నీ జబ్బులను ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్స తీసుకుంటే కిడ్నీ సంబంధ వ్యాథుల బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చని తెలిపారు. యుక్త వయస్సులో వారు కూడా కిడ్నీ సంబంధ వ్యాధుల బారిన పడతుండటం ప్రస్తుతం అందోళన కలిగిస్తున్న అంశమన్నారు. సరైన సమయంలో సరైన చికిత్స తీసుకోకపోతే డయాలసిస్‌ బారిన పడటం ఆ తరువాత కిడ్నీ మార్చిడి ఒక్కటే పరిష్కార మార్గమని తెలిపారు. గ్లైనిగల్స్‌ హాస్పిటల్స్‌లో కిడ్నీ మార్చిడి శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ సందర్భంగా కిడ్నీ ట్రాన్సప్లాంట్‌ అయి సాధారణ జీవితం గడుపుతున్న వారు వారి అనుభవాలను పంచుకున్నారు. అనంతరం ప్రత్యేక కిడ్నీ ప్యాకేజీని డాక్టర్లు ప్రారంభించారు.