ఎక్మోతో 11 నెలల పాప ప్రాణాలు కాపాడిన కిమ్స్‌ కడల్స్‌ వైద్యులు

నవతెలంగాణ-శేరిలింగంపల్లి
నిండా ఏడాది కూడా నిండని ఓ పసిపాప ప్రా ణాలను గచ్చిబౌలిలోని కిమ్స్‌ కడల్స్‌ వైద్యులు ఎక్మో సపోర్టుతో నిలబెట్టామని వైద్యులు తెలిపారు. తీవ్రమైన న్యుమోనియాతో చేరిన. ఈ పాపకు ఆస్పత్రికి చెందిన లీడ్‌ కన్సల్టెంట్‌ పీడి యాట్రిక్‌ ఇంటెన్సివిస్ట్‌ డాక్టర్‌ సుమన్‌ లీంగా బత్తిన, కన్సల్టెంట్‌ పీడియాట్రిక్‌ ఇంటెన్సి విస్ట్‌ డాక్టర్‌ అలేఖ్యల నేతత్వంలో చికిత్స అందిం చారు. ఈ పాపకు అందించిన చికిత్స వివరాల ను వివరించారు. ’11 నెలల వయసున్న అ న్విక అనే పాపకు హెచ్‌1ఎన్‌1 (స్వైన్‌ ఫ్లూ), న్యుమోనియా సోకింది. ఆమెను ఓ ప్రయివేట్‌ ఆస్పత్రిలో వెంటిలేటర్‌ మీద పెట్టి చికిత్స అం దించినా ఆమెకు తగినంతగా ఆక్సిజన్‌ అందక పోతుండటంతో గచ్చిబౌలి లోని కిమ్స్‌ కడల్స్‌ ఆస్పత్రికి పంపారు. వెంటనే పాపను ఎక్మో సపోర్టు మీద పెట్టి, పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు ప్రయత్నించాం. అలా ముందుగా 22 రోజుల పాటు ఎక్మో సపోర్టు పె ట్టడంతో పాటు, మరో పది రోజులు ఐసీయూలో ఉంచి చికిత్స చేయాల్సి వచ్చింది. ఎట్టకేలకు పా ప పూర్తిగా కోలుకోవడంతో సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జి చేశాం’ అని తెలిపారు.