– 402.30 అడుగులకు చేరిన నీటిమట్టం అ ఇన్ ఫ్లో 5 వేల క్యూసెక్కులు
నవతెలంగాణ-పాల్వంచ రూరల్
కిన్నెరసాని జలాశయం నిండుకుండను తలపిస్తోంది. డ్యాం సామర్థ్యం 407 అడుగులు కాగా.. గురువారం రాత్రి ఐదు గేట్లు ఎత్తి నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేశారు. శుక్రవారం ఉదయం 402 అడుగులుగా ఉన్న నీటిమట్టం సాయంత్రం 402.30 అడుగులకు చేరింది. ఇన్ ఫ్లో 3000 క్యూసెక్కులుగా డ్యామ్ సైట్ అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే సమీప ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. నీటి ప్రవాహ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.