– 21-2తో బరోడా బాద్‌షాస్‌పై గెలుపు
– ప్రొ పంజా లీగ్ తొలి సీజన్
న్యూఢిల్లీ : కిరాక్ హైదరాబాద్ ఆర్మ్ రెజ్లర్లు ఖతర్నాక్ ప్రదర్శన చేశారు. సోమవారం జరిగిన గ్రూప్ దశ మ్యాచ్‌లో బరోడా బాద్‌షాస్‌పై 21-2తో ఏకపక్ష విజయం సాధించగా, ప్రొ పంజా లీగ్ (ఆర్మ్ రెజ్లింగ్)లో కిరాక్ హైదరాబాద్ ఏకంగా ఐదో విజయం నమోదు చేసింది. అండర్ కార్డ్ మ్యాచుల్లో తొలుత కిరాక్ హైదరాబాద్ 1-2తో వెనుకంజ వేసినా.. మెయిన్ కార్డ్ మ్యాచుల్లో స్వీప్ చేశారు. పురుషుల 80 కేజీల విభాగంలో అస్కర్ అలీ 5-0తో గెలుపొందగా.. 90 కేజీల విభాగంలో సిద్దార్థ్ మలాకర్ 10-0, 70 కేజీల విభాగంలో స్టీవ్ థామస్ 5-0తో అదరగొట్టారు. మెయిన్ కార్డ్‌లోనే 20 పాయింట్లు సాధించిన కిరాక్ హైదరాబాద్.. 21-2తో బరోడా బాద్‌షాస్‌ను చిత్తుగా ఓడించింది. ఏడు మ్యాచుల్లో ఐదో విజయంతో పాయింట్ల పట్టికలో కిరాక్ హైదరాబాద్ అగ్రస్థానంలో కొనసాగుతుంది.