– మాస్టర్స్ 2024
ఇక్సాన్ సిటీ : భారత వర్థమాన షట్లర్ కిరణ్ జార్జ్ కొరియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్ 300 టోర్నమెంట్ సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్లో జపాన్ షట్లర్ టకుమ ఒబయాసిపై కిరణ్ జార్జ్ 21-14, 21-16తో వరుస గేముల్లో విజయం సాధించాడు. 39 నిమిషాల్లోనే వరల్డ్ నం.34 టకుమను చిత్తు చేసిన కిరణ్ జార్జ్ సెమీఫైనల్లో టాప్ సీడ్ కునాల్‌విట్ విటిడ్‌శరన్ (ఇండోనేషియా)ను ఎదుర్కొనున్నాడు. ప్రీ క్వార్టర్స్‌లో మూడో సీడ్ చైనీస్ తైసీ ఫట్లర్ యు జెన్‌ను 21-17, 19-21, 21-17తో చిత్తు చేసిన కిరణ్ జార్జ్.. సీజన్లో తొలి టైటిల్ దిశగా సాగుతున్నాడు.