నవతెలంగాణ – మద్నూర్
శుక్రవారం నాడు బాన్సువాడ సబ్ కలెక్టర్ గా బాధ్యతలు తీసుకున్న కిరణ్మై కొప్పిశెట్టి ఐఏఎస్ అధికారికి మద్నూర్ తాసిల్దార్ ఎండి ముజీబ్ సన్మానిస్తూ పుష్పగుచ్చం అందజేసి నమస్కారాలు తెలిపారు. అదేవిధంగా బాన్సువాడ ఆర్డీవో గా ఐదు నెలలుగా విధులు నిర్వహించి బదిలీపై వెళ్తున్న రమేష్ రాథోడ్ కు సన్మానించి పుష్పగుచ్చని అందజేశారు.