రాజస్థాన్‌ క్యాబినెట్‌ మంత్రి పదవికి కిరోడి లాల్‌ మీనా రాజీనామా

జైపూర్‌: రాజస్థాన్‌ బీజేపీ నేత కిరోడి లాల్‌ మీనా (72) రాష్ట్ర క్యాబినెట్‌ మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన సన్నిహితుడు గురువారం తెలిపారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో తన బాధ్యత కింద ఉన్న ఏడు పార్లమెంటు స్థానాల్లో బీజేపీ ఓడిపోతే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని మీనా ప్రకటించారు. అయితే జూన్‌ 4 వెలువడిన ఫలితాల్లో ఆ రాష్ట్రంలో బీజేపీ పోటీ చేసిన లాల్‌ మీనా తన స్థానిక దౌసాతో సహా కొన్ని స్థానాల్లోనూ ఓడిపోయింది. దీంతో ఎన్నికలకు ముందు ప్రకటించినట్టు.. లాల్‌ మీనా తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పదిరోజుల క్రితమే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భజన్‌లాల్‌శర్మకు పంపారని ఆయన సన్నిహితుడు తెలిపారు.