కీర్తిలాల్‌ జ్యుయలర్స్‌ ‘టీమ్‌ మార్క్స్‌ మెన్‌’ అవార్డు

కీర్తిలాల్‌ జ్యుయలర్స్‌ 'టీమ్‌ మార్క్స్‌ మెన్‌' అవార్డుహైదరాబాద్‌ : ప్రముఖ అభరణాల విక్రయ రిటైల్‌ చెయిన్‌ కీర్తిలాల్‌ జ్యుయలర్స్‌కు 2024-25కు గాను అత్యంత ప్రాధాన్యతమైన పని ప్రదేశానికి గాను ‘టీమ్‌ మార్క్స్‌ మెన్‌’ అవార్డు దక్కిందని ఆ సంస్థ తెలిపింది. ఇటీవల డిల్లీలో జరిగిన కార్యక్రమంలో మాజీ పార్లమెంట్‌ సభ్యులు జయప్రద చేతుల మీదుగా కీర్తిలాల్స్‌ రిటైల్‌ సేల్స్‌ అండ్‌ ఆపరేషన్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ముత్తుకుమార్‌ ఈ పురస్కారాన్ని అందుకున్నారని పేర్కొంది. పని ప్రదేశంలో పర్యావరణ వ్యవస్థ, సమానత్వం, రివార్డులు, సామాజిక సమన్యాయం తదితర అంశాల అధారంగా ఈ అవార్డును ఇస్తారని ఆ సంస్థ తెలిపింది.